VIDEO: శ్రీకీతకీలో సంగమేశ్వర స్వామికి పూజలు
SRD: ఉమ్మడి జిల్లాలో ప్రసిద్ధి చెందిన మహా పుణ్యక్షేత్రం ఝరాసంగం మండల కేంద్రంలోని శ్రీ కేతకి ఆలయంలో సోమవారం తెల్లవారుజామున విశేష పూజలు నిర్వహించారు. మార్గశిర మాసం శుక్లపక్షం, చవితి తిథి పురస్కరించుకొని సంగమేశ్వర స్వామి మహాలింగానికి రుద్రాభిషేకం, పంచామృతం, గంగా జలాభిషేకం, అమ్మవారికి కుంకుమార్చన, పుష్పాలంకరణతో మహా మంగళ హారతి నైవేద్యం సమర్పించారు.