మంత్రిని కలిసిన జిల్లా ఎస్పీ
NRPT: మంత్రి శ్రీహరిని జిల్లా ఎస్పీ వినీత్ ఆదివారం ఉదయం మంత్రి కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి పులమొక్కను అందజేశారు. జిల్లాలో శాంతి భద్రతలపై తీసుకోవాల్సిన చర్యలపై సున్నితమైన ప్రదేశాల్లో ఏ వర్గం వారి మనసు మనోభావాలు దెబ్బ తినకుండా తీసుకోవాల్సిన చర్యలపై చర్చించినట్లు సమాచారం. అంతరాష్ట్ర సరిహద్దులు ఉన్నందున రవాణా నేరాలపై నియంత్రణ అక్రమ రవాణాలపై చర్యలపై చర్చించినట్టు తెలిపారు.