మహాకవుల వారసుల సాక్షిగా నిర్మల్ కవికి పట్టాభిషేకం
NRML: సాహితీ దిగ్గజాల వారసుల చేతుల మీదుగా నిర్మల్ జిల్లా కవి గైని భోజన్న (నాని) అరుదైన గౌరవం అందుకున్నారు. విజయవాడలో శ్రీశ్రీ కళావేదిక ఆధ్వర్యంలో జరిగిన సభలో.. శ్రీనాథుడు, రామదాసు వంటి మహనీయుల వారసులు భోజన్నను 'అక్షర ప్రవీణ' జాతీయ పురస్కారంతో సత్కరించారు. ఒక సామాన్య రైతు బిడ్డను వేదికపై 'సంపూర్ణ కవి'గా అభివర్ణిస్తూ పట్టాభిషేకం చేశారు.