KCR కార్యాలయంపై దాడి.. ఖండించిన సబిత
TG: మాజీ సీఎం కేసీఆర్ గజ్వేల్ కార్యాలయంపై కాంగ్రెస్ దాడిని ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి తీవ్రంగా ఖండించారు. సీఎం రేవంత్ రెడ్డి బాధ్యతారాహిత్య వ్యాఖ్యలే ఈ హింసకు కారణమని మండిపడ్డారు. అసెంబ్లీలో 'మా దగ్గర కండలు తిరిగిన వారున్నారు' అనడం రౌడీయిజాన్ని, అరాచకాలను ప్రేరేపించడమేనని.. ఇలాంటి మాటలు ప్రజాస్వామ్యానికి చేటని ఆమె విమర్శించారు.