షర్మిలపై బీజేపీ నేత ఆగ్రహం

షర్మిలపై బీజేపీ నేత ఆగ్రహం

GNTR: షర్మిల హిందువుల మనోభావాలతో ఆడుకుంటున్నారని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వల్లూరి జయప్రకాష్ గుంటూరులో ఆదివారం తీవ్రంగా విమర్శించారు. దళితవాడల్లో దేవాలయాలు ఎవరు కట్టమన్నారంటూ ఆమె మాట్లాడిన మాటలపై ఆయన స్పందించారు. ముస్లింల మసీదులు, క్రిస్టియన్ల చర్చిల గురించి మాట్లాడలేని షర్మిల, హిందూ దేవాలయాల గురించి మాట్లాడటం సిగ్గుచేటని జయప్రకాష్ మండిపడ్డారు.