ఆటో, బైక్ ఢీ.. ఒకరు మృతి

ఆటో, బైక్ ఢీ.. ఒకరు మృతి

GNTR: కొల్లిపర మండలం చివలూరులో సోమవారం రాత్రి ఆటో, బైక్ ఢీకొన్న ప్రమాదంలో కంచర్ల ఇస్సాకు (38) మృతి చెందారు. బైక్‌పై ప్రయాణిస్తున్న సుధీర్ (28)కు తీవ్ర గాయాలు కాగా, ఆటో డ్రైవర్‌కు కాలు విరిగినట్లు స్థానికులు తెలిపారు. క్షతగాత్రులను వెంటనే చికిత్స నిమిత్తం 108 అంబులెన్స్‌లో తెనాలి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.