VIDEO: సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమం

VIDEO: సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమం

MDK: వెల్దుర్తి మండల కేంద్రంలో బుధవారం పోలీసులు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి ఆదేశాల మేరకు సైబర్ నేరాలు, ట్రాఫిక్ నిబంధనలు, రోడ్డు ప్రమాదాల నివారణ, మాదకద్రవ్యాల నిర్మూలన అంశాలపై అవగాహన కల్పించారు. అపరిచిత వ్యక్తులు పంపిన మెసేజ్, లింకులు ఓపెన్ చేయవద్దని సూచించారు. సైబర్ నేరానికి గురైతే 1930కు ఫిర్యాదు చేయాలని అన్నారు.