చేపలు పట్టడానికి వెళ్లి.. శవమై తేలాడు..!
VKB: చెరువులో జారి పడి ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన తాండూర్ పట్టణంలో చోటుచేసుకుంది. SI నుమాన్ అలీ వివరాల ప్రకారం.. మాసన్‌పల్లికి చెందిన వెంకటయ్య గురువారం చేపలు పట్టేందుకు వెళ్లి, ప్రమాదవశాత్తు చెరువులో జారి పడ్డాడు. సమాచారం అందుకున్న గ్రామస్థులు, పోలీసులు ఇవాళ మృతదేహాన్ని వెలికి తీసి పోస్టుమార్టం నిమిత్తం తాండూర్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు.