రోడ్డు ప్రమాదం.. యువకుడికి తీవ్ర గాయాలు

రోడ్డు ప్రమాదం.. యువకుడికి తీవ్ర గాయాలు

WGL: వర్ధన్నపేట మున్సిపాలిటీ పరిధిలోని డీసీ తండా వద్ద ఆదివారం జాతీయ రహదారిపై ద్విచక్రవాహనాన్ని టిప్పర్ లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మొగిలి ముఖేష్ అనే యువకుడికి తీవ్ర గాయాలు అయ్యాయి. గాయపడిన ముఖేష్ మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం కోమటిపల్లికి చెందినవాడిగా గుర్తించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.