ఓటు కోసం లండన్ నుంచి వచ్చిన యువకుడు
NGKL: తెలకపల్లి మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునేందుకు భాషమోని రాములు కుమారుడు యాదగిరి లండన్ నుంచి స్వగ్రామానికి వచ్చారు. ఉన్నత చదువుల కోసం మూడేళ్ల క్రితం లండన్ వెళ్లిన యాదగిరి.. గ్రామాభివృద్ధి కోసం యువత ఎన్నికలలో పాల్గొనాలని ఆకాంక్షించారు. ఓటు కోసం విదేశం నుంచి వచ్చిన యాదగిరిని పలువురు అభినందించారు.