దేవుని గుట్ట తండాలో సేవాలాల్ జయంతి ఉత్సవాలు
SRPT: తుంగతుర్తి మండలం దేవుని గుట్ట తండాలో సంతు సేవలల్ మహారాజ్ 287వ జయంతి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ప్రత్యేక పూజలు, నైవేద్యాలు సమర్పించారు. భోగ్ బడారో కార్యక్రమం నిర్వహించి భక్తులకు ప్రసాదం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ స్వాతి భాస్కర్, గ్రామ పెద్దలు, యువకులు పాల్గొన్నారు.