ఘోర రోడ్డు ప్రమాదం.. వ్యక్తి మృతి

ఘోర రోడ్డు ప్రమాదం.. వ్యక్తి మృతి

KNR: మానకొండూరు నియోజకవర్గం శంకరపట్నం మండలం తాటికల్ గ్రామంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హుజరాబాద్ నుండి అంబాలాపూర్ వెళ్తున్న డీజిల్ ట్యాంకర్ తాటికల్ గ్రామంలో డ్రైవర్ నిర్లక్ష్యంతో పూదారి శ్రీనివాస్‌ను ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ సంఘటనలో చింతగుట్ట తాటికల్ గ్రామానికి చెందిన ఆరుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి.