పంట కోతకు చెరువుకు కోత పెట్టారు
MLG: మంగపేట మండలంలోని నర్సాపురం బోరు శివారులో ఉన్న అప్పలనర్సయ్య చెరువు శిఖంలో వరి సాగు చేసిన కొందరు రైతులు, ఆ వరి కోసేందుకు హార్వెస్టర్లు తీసుకెళ్లడానికి ఏకంగా చెరువు కట్టను తవ్వి ధ్వంసం చేశారని ఆయకట్టు రైతులు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా చెరువు శిఖంలో వరిసాగు చేయడమే కాకుండా, కోతల కోసం చెరువు కట్టను తవ్వి కోతలు కోస్తున్నారని వారు పేర్కొన్నారు.