తాళ్లకేరలో పీహెచ్‌సీని ప్రారంభించిన ఎమ్మెల్యే
ATP: గుమ్మఘట్ట మండలం తాళ్లకేర గ్రామంలో రూ.1.94 కోట్లతో నూతనంగా నిర్మించిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని MLA కాలవ శ్రీనివాసులు ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. గ్రామీణ ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందుబాటులోకి తీసుకురావడమే ప్రభుత్వ లక్ష్యం అన్నారు. ఈ ఆరోగ్య కేంద్రం గ్రామీణ ఆరోగ్య వ్యవస్థ బలోపేతానికి కీలకంగా ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు.