ప్రాథమిక వైద్యశాల నిర్మాణ పనులు పరిశీలించిన ఎమ్మెల్యే

PLD: వెల్దుర్తి మండలం ఉప్పలపాడు గ్రామంలో నిర్మాణంలో ఉన్న ప్రాథమిక వైద్యశాలను మాచర్ల నియోజకవర్గ ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి ఇవాళ సందర్శించారు. ఈ సందర్భంగా జరుగుతున్న పనుల పురోగతిని పరిశీలించి, నిర్మాణం నాణ్యతపై అధికారులు, కాంట్రాక్టర్లతో ఆరా తీశారు. ఆసుపత్రిని త్వరితగతిన పూర్తి చేసి స్థానిక ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని ఆయన సూచించారు.