BREAKING: ఫ్లైఓవర్‌ను ప్రారంభించిన గడ్కరీ

TG: హైదరాబాద్‌లో నూతనంగా నిర్మించిన అంబర్‌పేట్ ఫ్లైఓవర్‌ను కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ ప్రారంభించారు. గోల్నాక నుంచి అంబర్‌పేట వరకు ఫ్లైఓవర్ నిర్మించారు. 330 కోట్ల రూపాయలను వెచ్చించి నాలుగు లేన్లతో 1.7 కిలోమీటర్ల మేర ఈ ఫ్లైఓవర్ నిర్మాణం చేశారు. దీంతో ట్రాఫిక్ రద్దీ, ప్రయాణ సమయం తగ్గనుంది.