కమాండ్ కంట్రోల్ సెంటర్ ప్రారంభించిన ఎస్పీ
BHPL: జిల్లా కేంద్రంలోని పోలీస్ కార్యాలయంలో అత్యాధునిక 'కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను జిల్లా ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ ఇవాళ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. శాంతిభద్రతల పరిరక్షణలో సాంకేతిక పరిజ్ఞానం కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు. జిల్లా వ్యాప్తంగా నిఘా పెంచేందుకు, నేరాలను ముందస్తుగా గుర్తించేందుకు ఈ కేంద్రం ఎంతో దోహదపడుతుందన్నారు.