వైద్య సేవలను పరిశీలించిన కలెక్టర్

వైద్య సేవలను పరిశీలించిన కలెక్టర్

NGKL: తెలకపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ మంగళవారం తనిఖీ చేశారు. ఆసుపత్రిలో హాజరు రిజిస్టర్‌ను పరిశీలించారు. అనంతరం రోగులతో మాట్లాడి వైద్య సేవలపై అడిగి తెలుసుకున్నారు. మెడికల్ స్టోర్‌లో మందులను క్రమపద్ధతిలో ఉంచాలని, అవసరమైన ర్యాకులను ఏర్పాటు చేయాలని డీఎంహెచ్‌వోని ఆదేశించారు.