అనుమానాస్పదంగా విద్యార్థిని మృతి
కోనసీమ: జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. రామచంద్రపురంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థిని అకస్మాత్తుగా మృతి చెందింది. పాఠశాల సిబ్బంది వివరాల ప్రకారం.. స్కూల్లో ఒక్కసారిగా విద్యార్థిని స్పృహ తప్పి పడిపోవడంతో, వెంటనే ఏరియా ఆస్పత్రికి తరలించారు. అప్పటికే బాలిక మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.