ప్రమాద బాధితులను పరామర్శించిన ఎమ్మెల్యే

GDWL: గద్వాల పట్టణంలో జరిగిన రోడ్డు ప్రమాదం సమాచారం తెలుసుకున్న ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి, జిల్లా కలెక్టర్ బి సంతోష్ గద్వాల ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి చికిత్స పొందుతున్న నర్సింగ్ విద్యార్థులను పరామర్శించారు. ఘటనకు సంబంధించిన వివరాలను విద్యార్థుల వద్ద తెలుసుకున్నారు. జిల్లా ఎస్పీ శ్రీనివాసరావుతో పాటు పలువురు అధికారులు ఆయన వెంట ఉన్నారు.