మాస్టర్ ప్లాన్‌తో మరింత అభివృద్ధి: ఎమ్మెల్యే

మాస్టర్ ప్లాన్‌తో మరింత అభివృద్ధి: ఎమ్మెల్యే

SKLM: మాస్టర్ ప్లాన్‌తో శ్రీకాకుళం పట్టణం మరింత అభివృద్ధి చెందుతుందని శ్రీకాకుళం MLA గొండు శంకర్ అన్నారు. ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం నుంచి ప్రకటన విడుదల చేశారు. పురపాలన, పట్టణ అభివృద్ధి శాఖ ద్వారా జీవో ఎంఎస్ నెంబర్ 154 కూటమి ప్రభుత్వం విడుదల చేసిందని అన్నారు. ప్రజల అవసరాలు, భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని రోడ్లు విస్తరణతో పాటు అభివృద్ధి చేయడం జరుగుతుందన్నారు.