'ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించిన అధికారులపై చర్యలు తీసుకోవాలి'
NRPT: సర్పంచ్ ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థులు నామినేషన్లు వేస్తే స్క్రూటిని తర్వాత అప్పీల్ కు సమయం ఇవ్వకుండా రిజెక్ట్ చేయడం ఎన్నికల నియమావళిని ఉల్లంఘించినట్టే అని బీజేపీ సీనియర్ నాయకులు నాగురావ్ నామాజీ అన్నారు. నారాయణపేట మండలం లింగంపల్లి గ్రామంలో ఇద్దరు అభ్యర్థుల నామినేషన్లు స్వీకరించి సాయంత్రం ఐదు గంటల తర్వాత ఓ అభ్యర్థి నామినేషన్ రిజెక్ట్ అయిందని చెప్పడం సరికాదన్నారు.