శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న ఎమ్మెల్యే దంపతులు

BDK: ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు, సతీమణి ప్రవీణ దంపతులు మంగళవారం పట్టణంలోని వెంకటేశ్వర కాలనీలో ఉన్న శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారిని దర్శించుకున్న ఎమ్మెల్యే దంపతులను ఆలయ నిర్వాహకులు సన్మానించి తీర్థప్రసాదాలు అందజేశారు. రాష్ట్ర ప్రజలందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని ఎమ్మెల్యే కోరుకున్నారు.