'బాలికలకు హెచ్‌పీవీ వ్యాక్సినేషన్ కీలకం'

'బాలికలకు హెచ్‌పీవీ వ్యాక్సినేషన్ కీలకం'

సత్యసాయి: మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆదేశాల మేరకు ధర్మవరం నియోజకవర్గంలో హెచ్‌పీవీ వ్యాక్సినేషన్ కార్యక్రమం సోమవారం నిర్వహించారు. ముదిగుబ్బ, మలకవేముల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో 14 ఏళ్ల బాలికలకు ఎంపీపీ ఆదినారాయణ యాదవ్ సమక్షంలో టీకాలు వేశారు. భవిష్యత్తులో వచ్చే గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ నివారణకు ఈ వ్యాక్సిన్ ఎంతో కీలకమని ఆయన పేర్కొన్నారు.