మృతదేహాలను పరిశీలించిన ఎల్లారెడ్డి ఎమ్మెల్యే

కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ బ్యాక్ వాటర్‌లో నీట మునిగి ముగ్గురు యువకులు మృతి చెందిన ఈ విషయం తెలుసుకున్న ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్మోహన్ రావు మంగళవారం ఆసుపత్రిలో పరిశీలించి కుటుంబ సభ్యులను ఓదార్చారు. అనంతరం వారికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. చేతికి వచ్చిన కుమారులు అకాల మరణం చెందడం చాలా దిగ్భ్రాంతికి గురిచేసిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.