విచారణ పేరుతో వేధింపులు.. ఆత్మహత్య ?
కర్నూలుకు చెందిన ఓ బాలిక OCT 28న అదృశ్యమైంది. తల్లిదండ్రులు ఎంత వెతికినా ఆమె ఆచూకీ దొరకలేదు. అయితే తమ కుమార్తెను TGకి చెందిన రామ్‌నాయక్ అనే యువకుడు ప్రేమించాడని, అతనిపై అనుమానం ఉందని పట్టణ PSలో బాలిక తల్లి ఫిర్యాదు చేసింది. దీంతో విచారణ పేరుతో ఓ కానిస్టేబుల్ అతడిని కొట్టాడన్న మనస్తాపంతో పురుగుల మందు తాగి ఆత్మహత్యయత్నానికి పాల్పడినట్లు కుటుంబ సభ్యులు ఆరోపించారు.