నామినేషన్ కేంద్రాల పరిశీలన

నామినేషన్ కేంద్రాల పరిశీలన

KMR: గాంధారి మండలంలోని పలు గ్రామాలలో ఏర్పాటుచేసిన స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ కేంద్రాలను ఎల్లారెడ్డి డీఎస్పీ శ్రీనివాసరావు పరిశీలించారు. అక్కడ విధులు నిర్వహిస్తున్న సిబ్బందికి ఆయన పలు సలహాలు సూచనలు అందజేశారు. నామినేషన్ కేంద్రాల వద్ద ఎలాంటి గొడవలు జరగకుండా పలు జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. ఆయన వెంట గాంధారి ఎస్సై ఆంజనేయులు, పోలీస్ సిబ్బంది ఉన్నారు.