పేద ప్రజల ఆరోగ్యానికి CMRF భరోసా: ఎమ్మెల్యే
E.G: చాగల్లు గ్రామానికి చెందిన ఆరుగురు లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి మంజూరైన రూ. 2,50,454 లక్షల విలువైన చెక్కులను కొవ్వూరు ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు ఇవాళ అందజేశారు. పేదల ఆరోగ్యానికి సీఎం సహాయనిధి భరోసా కల్పిస్తుందన్నారు. దీనిని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ ఛైర్మన్ నాదెళ్ళ రామ్ చౌదరి, తాళ్లూరి శ్రీను, తదితరులు పాల్గొన్నారు.