ప్రభుత్వ భూములు ఆక్రమిస్తే కేసులు: MRO

అన్నమయ్య: ప్రభుత్వ భూములను ఆక్రమిస్తే కేసులు నమోదు చేస్తామని MRO పుల్లారెడ్డి పేర్కొన్నారు. శనివారం సమస్యాత్మకంగా మారిన సర్వేనెంబర్ 206లోని ప్రభుత్వ భూమిలో బోర్డు ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. ఆ ప్రాంతంలో ఎలాంటి అక్రమ కార్యక్రమాలు చేపట్టిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఆ సర్వే నెంబరులో కేవలం 17 ఎకరాలు మాత్రమే ప్రభుత్వం ఉన్నట్లు ఆయన వివరించారు.