పేదలకు ఎల్లవేళలా అండగా ఉంటాం: ఎమ్మెల్యే

పేదలకు ఎల్లవేళలా అండగా ఉంటాం: ఎమ్మెల్యే

SRCL:పేద ప్రజలకు తమ ప్రభుత్వం ఎల్లవేళలా అండగా ఉంటుందని వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు. వేములవాడ అర్బన్, వేములవాడ రూరల్ మండలాల పరిధిలో 55 మంది లబ్ధిదారులకు సుమారు రూ.18 లక్షల విలువైన ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను ఇవాళ తన క్యాంపు కార్యాలయంలో ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పేద ప్రజల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం అన్నారు.