గంజాయి పట్టివేత.. ఇద్దరు అరెస్ట్
WGL: దామెరలో గంజాయి భారీగా పట్టుబడింది. పరకాల రూరల్ CI రంజిత్ రావు వివరాల ప్రకారం.. నడికుడ మండలం కంటాత్మకూరుకు చెందిన అనిల్ కుమార్, రాజేష్‌లు ఓ వ్యక్తి దగ్గర గంజాయిని కొనుగోలు చేసి దామెరకు వెళ్తున్న క్రమంలో దామెర పోలీసులు పట్టుకున్నారు. వారి నుంచి 210 గ్రాముల గంజాయితోపాటు బైక్, రెండు ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారిని అరెస్ట్ చేసి విచారిస్తున్నారు.