పిడుగురాళ్లలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కావిడి ఉత్సవం
PLD: పిడుగురాళ్లలో కొలువైన నాగులగుడి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఊరేగింపు మంగళవారం ఘనంగా నిర్వహించారు. చైత్ర మాసం శుద్ధ షష్టి సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ మహోత్సవంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి దర్శనం పొందారు. గ్రామ వీధుల్లో ఊరేగింపు వైభవంగా సాగి ఆధ్యాత్మిక వాతావరణాన్ని సృష్టించింది. ఆలయ పరిసరాలు భక్తుల సందడితో కళకళలాడాయి.