VIDEO: 'అందరి ఆమోదంతోనే రాయలపేట రోడ్డు విస్తరణ'
CTR: పెద్ద పంజాణి మండలం రాయలపేట గ్రామంలో రోడ్డు విస్తరణ పనులు అందరి ఆమోదంతోనే జరుగుతున్నట్లు పలమనేరు MLA అమర్నాథ్ రెడ్డి పేర్కొన్నారు. TDP కార్యాలయంలో రాయలపేట గ్రామస్తులతో మంగళవారం సమావేశం అయ్యారు. ఈ మేరకు రోడ్డును ఊరు మధ్య గుండా ఏర్పాటు చేసుకునేందుకు ఎటువంటి అభ్యంతరం లేదని గ్రామస్తులు తెలియజేశారు. దీంతో త్వరలో పనులు మొదలుపెట్టేలా చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే తెలిపారు.