బకాయిదారులకు నోటీసులు ఇవ్వండి: కమిషనర్

KKD: నగర అభివృద్ధికి దోహదపడే పన్నుల వసూలు విషయంలో ఏ మాత్రం నిర్లక్ష్యం వద్దని, పన్ను బకాయిదారులకు వెంటనే నోటీసులు ఇవ్వాలని నగరపాలక సంస్థ కమిషనర్ భావన రెవెన్యూ శాఖ అధికారులను ఆదేశించారు. ఆస్తి, నీటి పన్నుల బకాయిలు, నగరపాలక సంస్థ షాపింగ్ కాంప్లెక్స్‌లోని దుకాణాల అద్దె బకాయిల విషయమై కమిషనర్ శుక్రవారం రెవెన్యూ అధికారులతో సమీక్షించారు.