నేపాలీ గ్యాంగ్ కోసం 6 ప్రత్యేక బృందాలతో గాలింపు
HYD: కార్ఖానా పోలీస్ స్టేషన్ పరిధిలో నేపాలీ గ్యాంగ్ చోరీకి పాల్పడ్డ విషయం తెలిసిందే. అయితే దొంగతనానికి పాల్పడిన నేపాలీ గ్యాంగ్ కోసం పోలీసులు 6 ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు. దొంగతనం చేశాక ఆరుగురు నిందితులు ఓ క్యాబ్‌లో శంషాబాద్ వరకు వెళ్లినట్లు గుర్తించారు. అయితే నిందితులు బార్డర్ దాటకముందే పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.