జిల్లా ప్రజలకు అలర్ట్
SKLM: ఆముదాలవలస, బూర్జ, హిర మండలం, జలుమూరు, ఎల్.ఎన్.పేట, పాతపట్నం, సారవకోట, సరుబుజ్జిలి మండల లో తీవ్ర వడగాలులు వీచే అవకాశం ఉందని APSDMA ఎండీ ప్రఖర్ జైన్ శనివారం తెలిపారు. అలాగే సోమవారం నుంచి 3 రోజులపాటు ఉత్తరాంధ్రలో అక్కడక్కడ పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. విభిన్న వాతావరణ పరిస్థితులలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.