'కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి'
JGL: రైతులు ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని మార్కెట్ కమిటీ ఛైర్మన్ మాదం వినోద్ అన్నారు. భీమారం మండలంలోని ఈదుల లింగంపేట, పసునూరు, దేశాయిపేట గ్రామంలో ఆదివారం PACS ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు నరేశ్ రెడ్డి, నాయకులు పాల్గొన్నారు.