ఈ నెల 16న ఉద్యానవన పండ్ల తోటల మెగా వేలం పాట
ADB: ఉట్నూర్ ఐటీడీఏ పరిధిలోని ఉద్యాన నర్సరీలలో ఉన్న పండ్ల తోటలకు మూడు సంవత్సరాలకు కలిపి ఒకేసారి మెగా వేలం పాటను ఏప్రిల్ 16న నిర్వహించనున్నామని పీఓ యువరాజు మర్మాట్ తెలిపారు. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్, ఆసిఫాబాద్ జిల్లా జంబుగా, రాజంపేట మంచిర్యాల జిల్లా భీమారం, బెల్లంపల్లి తోటలకు మూడు సంవత్సరాలకు కలిపి ఒకేసారి వేల పాట ఐటీడీఏ కార్యాలయంలో ఉంటుందన్నారు.