త్వరలోనే బీసీ జనసేనతో సమావేశం: ఎమ్మెల్యే
RR: బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి బీసీ జనసేన అంకితభావంతో కృషి చేయాలని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు. షాద్ నగర్‌లో బీసీ జనసేన జాతీయ అధ్యక్షులు చంద్రశేఖరప్ప, సంఘం నాయకులు ఎమ్మెల్యేనను కలిసి ఉద్యమ ఉజ్వల పుస్తకాన్ని అందజేశారు. ఆయన మాట్లాడుతూ.. భవిష్యత్ కార్యాచరణ ప్రణాళిక రూపొందించడానికి త్వరలోనే బీసీ జనసేనతో సమావేశాన్ని ఏర్పాటు చేస్తానన్నారు.