విద్యార్థి ఉరి వేసుకొని ఆత్మహత్య!

విద్యార్థి ఉరి వేసుకొని ఆత్మహత్య!

HNK: సుబేదారి పోలీస్ స్టేషన్ పరిధిలోని రెవెన్యూ కాలనీలో మైనింగ్ డిప్లమా మూడో సంవత్సరం చదువుతున్న విద్యార్థి అక్షయ్ తాను ఉంటున్న కిరాయి ఇంట్లో గురువారం రాత్రి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు సబ్ ఇన్‌స్పెక్టర్ ఫణి తెలిపారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. మృతుడి స్వగ్రామం జనగాం జిల్లా బచ్చన్నపేట మండలం అలిపురంకు చెందిన వాడిగా గుర్తించారు.