మార్కెట్ మాజీ ఛైర్మన్ మృతి.. సీపీఎం నాయకులు నివాళి
JNG: స్టేషన్ ఘన్‌పూర్ వ్యవసాయ మార్కెట్ మాజీ ఛైర్మన్ చింతకుంట్ల నరేందర్ రెడ్డి అనారోగ్యంతో మృతి చెందారు. ఈ క్రమంలో చిల్పూర్ మండల సీపీఎం నాయకులు గురువారం ఉదయం వారి నివాసానికి వెళ్లి ఆయన పార్థివదేహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఆయన ఆత్మకు శాంతిచేకూర్చాలని భగవంతుని ప్రార్ధించి, వారి కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతి తెలిపారు.