ఎమ్మార్వోకు వినతిపత్రం సమర్పించిన బీజేపీ నాయకులు

ఎమ్మార్వోకు వినతిపత్రం సమర్పించిన బీజేపీ నాయకులు

E.G: గోకవరం మండలంలో సుమారు నెల రోజుల నుంచి శ్రీ సత్య సాయి బాబా మంచినీటి సరఫరా నిలిచిపోవడం జరిగింది. ఈ సమస్యపై మండల బీజేపీ నాయకులు ఆదివారం తహసీల్దార్ రామకృష్ణకు వినతిపత్రం సమర్పించారు. సత్యసాయి సిబ్బంది నీటిని శుద్ధి చేసే స్పటిక కొరత వలన నీటి సరఫరా ఆగడం జరిగిందన్నారు. అధికారులు, ప్రజా ప్రతినిధులు స్పందించి మండలానికి తాగునీరు అందించాలని కోరారు.