జిల్లాకు రేపు వర్ష సూచన

సత్యసాయి: జిల్లాలో రేపు వర్షాలు పడే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో అక్కడక్కడ పిడుగులు పడే అవకాశం ఉందని హెచ్చరించింది. ఇతర ప్రాంతాల్లో చెదురుమదురుగా తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఈ మేరకు రైతులు, ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.