ఇంద్రకీలాద్రిపై మహాలక్ష్మి యాగం

ఇంద్రకీలాద్రిపై మహాలక్ష్మి యాగం

 NTR: అక్షయ తృతీయ సందర్భంగా ఇంద్రకీలాద్రిపై లోక కల్యాణార్థం యాగశాలలో భక్తుల సమక్షంలో సోమవారం మహాలక్ష్మి యాగాన్ని రుత్వికులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. పూజా ద్రవ్యాలతో ఉన్న పట్టువస్త్రాలను హోమగుండం చుట్టూ మూడు సార్లు ప్రదక్షిణ చేసిన అనంతరం దాన్ని అగ్నిదేవుడికి సమర్పించడంతో పూర్ణాహుతి తంతు ముగిసింది.