సీఎస్ఐఐ చర్చి వద్ద ‘రన్ ఫర్ జీసస్’

సీఎస్ఐఐ చర్చి వద్ద ‘రన్ ఫర్ జీసస్’

MDK: మెదక్‌లోని సీఎస్ఐఐ చర్చి కమిటీ ఆధ్వర్యంలో ‘రన్ ఫర్ జీసస్’ కార్యక్రమం నిర్వహించారు. చర్చి నుంచి ర్యాలీ మొదలై పురవీధుల గుండా కొనసాగింది. మెదక్ ప్రెసిబేటరీ ఇన్‌ఛార్జి శాంతయ్య మాట్లాడుతూ.. కష్టసుఖాలను సమపాళ్లలో స్వీకరిస్తూనే, లోకమంతా శాంతి స్థాపించాలన్నదే ఏసు ప్రభువు మార్గమని తెలిపారు. చర్చి కమిటీ కోశాధికారి, స్థానిక కౌన్సిలర్ సంపత్ తదితరులు పాల్గొన్నారు.