వైభవంగా రామయ్య నిత్య కళ్యాణం

వైభవంగా రామయ్య నిత్య కళ్యాణం

BDK: భద్రాద్రి శ్రీ సీతారామ చంద్రస్వామి వారి దేవస్థానంలో మంగళవారం స్వామివారి నిత్య కళ్యాణ వేడుకను మంగళవారం అర్చకులు ఘనంగా నిర్వహించారు. స్వామివారికి సుప్రభాతం, ఆరాధన సేవ పూజలు చేశారు. స్వామివారిని మేళతాళాలతో గర్భగుడి నుంచి శ్రీ మండపంలో కొలువు తీర్చారు. అనంతరం స్వామివారి విశ్వక్సేన పూజ, అమ్మవారికి కంకణధార గావించి నిత్య కళ్యాణ వేడుకలను జరిపారు.