పుడ్ పాయిజన్ ఘటనపై స్పందించిన TGHRC
ASF: పెంచికల్ మండలంలోని ఎలూరు గిరిజిన ఆశ్రమ పాఠశాలలో జరిగిన పుడ్ పాయిజన్ ఘటనపై మానవ హక్కుల కమిషన్ తీవ్రంగా స్పందించింది. ఈఘటనను సుమోటగా జస్టిస్ షమీమ్ అక్తర్ నేతృత్వంలో స్వీకరించింది. ఇది ముమ్మాటికీ నిర్లక్ష్యమేనని, ఆర్టికల్ 21 కల్పించిన జీవించే హక్కు, ఆరోగ్యానికి భంగం కలిగించడమేనని కమిషన్ స్పష్టం చేసింది. ఈనెల 27 లోగా సమగ్ర నివేదిక సమర్పించాలని కలెక్టర్‌ను ఆదేశించింది.