సామెత - దాని అర్థం

'అత్త మీద కోపం దుత్త మీద చూపినట్లు'
దుత్త అంటే మట్టితో చేసిన చిన్న కుండ. కోడలికి అత్త మీద కోపం వచ్చిందంట, కానీ ఏమి చేస్తుంది పాపం అత్తేమో పెద్దావిడ, ఏమన్నా అందామా అంటే మొగుడు ఊరుకోడు అందుకని ఆ కోపాన్ని చేతిలో ఉన్న దుత్త మీద చూపుతూ విసిరి పగలకొట్టిందట. సాధారణంగా ఒకరి మీద కోపం మరొకరి మీద చూపించినప్పుడు ఈ సామెత వాడుతారు.