పోలీసుల కొరడా.. 70 వేల గంజాయి మొక్కలు ఔట్
త్రిపురలోని బిషాల్‌గఢ్ డివిజన్‌లో పోలీసులు కొరడా ఝుళిపించారు. యాంటీ నార్కోటిక్స్ డ్రైవ్‌లో భాగంగా భారీ ఎత్తున సాగవుతున్న గంజాయి తోటలను ధ్వంసం చేశారు. ఏకంగా 70 వేల గంజాయి మొక్కలను నరికి, తగులబెట్టారు. డ్రగ్స్ మాఫియాపై ఉక్కుపాదం మోపుతామని, అక్రమ సాగు చేస్తే కఠిన చర్యలు తప్పవని అధికారులు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.