జిల్లా కోర్టులో కేక్ కట్ చేసిన న్యాయవాదులు
JGL: అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ బిల్లు ఆమోదంపై జగిత్యాల జిల్లా న్యాయవాదులు హర్షం వ్యక్తం చేశారు. జిల్లా కోర్టులో టీపీసీసీ లీగల్ సెల్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ చట్టం ద్వారా సీనియర్, యువ న్యాయవాదుల సమస్యలు పరిష్కారమవుతాయని, ముఖ్యంగా బీమా సౌకర్యం కల్పించడం గొప్ప విషయమని వారు కొనియాడారు.